Tirupati Laddu Row: వీడియో ఇదిగో, వందేభారత్ రైలులో భజనలు చేస్తూ తిరుపతికి మాధవీలత, నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్న బీజేపీ మహిళా నేత

వందేభారత్ రైలులో బీజేపీ మహిళా నేత హైదరాబాద్ నుంచి తిరుమలకు పయనమయ్యారు. వేంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని బీజేపీ నేత దర్శించుకోనున్నారు.

BJP leader Madhavi Latha is going to Tirumala singing bhajans in Vande Bharat train Watch Video

హిందువులు పవిత్రంగా స్వీకరించే శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటే అది అత్యాచారం కిందకే వస్తుందంటూ తెలంగాణ బీజేపీ మహిళా నేత మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.వెంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా తిరుమలకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు. అందులో భాగంగానే సహచర భక్త బృందంతో కలిసి మాధవీలత తిరుమలకు బయలుదేరారు.

వందేభారత్ రైలులో బీజేపీ మహిళా నేత హైదరాబాద్ నుంచి తిరుమలకు పయనమయ్యారు. వేంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని బీజేపీ నేత దర్శించుకోనున్నారు. సహచర భక్త బృందంతో కలిసి ఆ గోవిందుడి నామం జపిస్తూ.. శ్రీనివాసుడి పాటలు పాడుతూ భజన చేస్తూ వందేభారత్‌తో రైలులో మాధవీలత తిరుమలకు బయలుదేరారు.

వీడియో ఇదిగో, నువ్వు అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడివేనా? చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్, ఎన్నిసార్లు తలనీలాలు సమర్పించావో చెప్పాలంటూ డిమాండ్

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now