UCC: త్వరలో ‘ఉమ్మడి పౌరస్మృతి’.. ఈ సమావేశాల్లోనే టేబుల్‌పైకి ముసాయిదా బిల్లు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముసాయిదా బిల్లు ఈ వర్షాకాల సమావేశంలో పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

UCC (Credits: Twitter)

Newdelhi, June 30: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ-UCC) ముసాయిదా బిల్లు ఈ వర్షాకాల సమావేశంలో (Monsoon Session) పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. యూసీసీపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు న్యాయ కమిషన్, న్యాయ మంత్రిత్వశాఖతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జులై 3న సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారమే తేల్చి చెప్పారు. సున్నితమైన అంశాలపై ముస్లింలను రెచ్చగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

High Court Delivers Judgment in Telugu: తెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం.. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి

Prakasam Horror: పరీక్షలో కాపీ కొట్టి డీబార్ అయిన విద్యార్థి.. పరీక్ష కేంద్రం ప్రిన్సిపల్‌పై కక్ష పెంచుకున్న వైనం.. ఈ క్రమంలో బ్లేడుతో ప్రిన్సిపల్‌ గొంతుకోసేందుకు యత్నం.. ప్రకాశం జిల్లా గిద్దలూరులో షాకింగ్ ఘటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now