High Court Delivers Judgment in Telugu: తెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం.. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి
తెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్ మచ్చబొల్లారంలోని భూవివాదంపై దాఖలైన అప్పీల్ పిటిషన్‌లో ఈ నెల 27న.. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్‌రావు, జస్టిస్ నగేశ్ భీమపాకతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాతృభాషలో తీర్పు చెప్పింది.
Hyderabad, June 30: తెలుగులో తీర్పు (Judgment in Telugu) వెలువరించి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్ (Secunderabad) మచ్చబొల్లారంలోని భూవివాదంపై (Land Dispute) దాఖలైన అప్పీల్ పిటిషన్‌లో ఈ నెల 27న.. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్‌రావు, జస్టిస్ నగేశ్ భీమపాకతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాతృభాషలో తీర్పు చెప్పింది. వాస్తవానికి సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులను అందరికీ అర్థమయ్యే ఇంగ్లిష్‌లోనే వెలువరించాల్సి ఉంటుంది. సాక్ష్యాధారాలు, ఇతర పత్రాలు స్థానిక భాషలో ఉంటే వాటిని ఇంగ్లిష్‌లోని అనువదించి ధర్మాసనానికి అందించాలి. లేకపోతే సుప్రీం కోర్టు, హైకోర్టుల రిజిస్ట్రీలు పిటిషన్లను స్వీకరించవు.
అలాంటిది.. రాష్ట్ర హైకోర్టు చరిత్రలోనే తొలిసారి తెలుగులో తీర్పు చెప్పి, కొత్త చరిత్ర లిఖించారు న్యాయమూర్తులు. ఈ మేరకు 45 పేజీల తీర్పును తెలుగులో వెలువరించారు. అప్పీల్ కోసం ఇంగ్లిష్‌లోనూ తీర్పు చెప్పి.. ఇంగ్లిష్ తీర్పును ప్రామాణికంగా తీసుకోవాలని పేర్కొన్నారు. హైకోర్టు నిర్ణయంపై తెలుగు భాషాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jun 30, 2023 09:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

