Uttar Pradesh Shocker: దారుణం, చిరుత పులిని చంపి తలకిందులుగా వేలాడదీసిన యూపీ గ్రామస్తులు, ఘటనపై మండిపడుతున్న నెటిజన్లు, షాకింగ్ వీడియో ఇదిగో..
ఆ తర్వాత ఆ చిరుతను చంపి తలకిందులుగా ((Leopard Killed and Hanged Upside Down ) చెట్టుకు వేలాడదీశారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలోని గ్రామంలో సంచరిస్తున్న చిరుత పులిని గ్రామస్తులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ చిరుతను చంపి తలకిందులుగా ((Leopard Killed and Hanged Upside Down ) చెట్టుకు వేలాడదీశారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కనియన్ గ్రామంలో తిరుగుతున్న చిరుతను మంగళవారం గ్రామ వాసులు బంధించారు. ఆపై ఆ చిరుతను చంపి తాడుతో కట్టి తలకిందులుగా చెట్టుకు వేలాడదీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిరుతను ఎవరు చంపారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. చేపలు పట్టేందుకు నదిలోకి దిగిన వ్యక్తి కుడి కాలు కొరికేసిన షార్క్, సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)