Israeli Missile Attack: ఇజ్రాయెల్ దాడిలో క్షణాల్లో కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

హెజ్‌బొల్లా (Hezbollah) ఇజ్రాయెల్‌ మధ్య క్షిపణులు, డ్రోన్‌ దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడిలో లెబనాన్‌ రాజధాని బీరుట్‌ సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ కుప్పకూలింది. క్షణాల్లో ధూళిగా మారిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Visuals of a building in Beirut's South Hobari neighborhood collapsing moments after an Israeli missile attack Watch Video

హెజ్‌బొల్లా (Hezbollah) ఇజ్రాయెల్‌ మధ్య క్షిపణులు, డ్రోన్‌ దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడిలో లెబనాన్‌ రాజధాని బీరుట్‌ సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ కుప్పకూలింది. క్షణాల్లో ధూళిగా మారిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ క్షిపణి దాడికి 40 నిమిషాల ముందు ఇజ్రాయెల్ హెచ్చరిక చేసింది. బీరుట్‌ దక్షిణాన ఉన్న రెండు నివాస భవనాలు, దాని చుట్టుపక్కల ఇళ్లలో ఉండే పౌరులు ఖాళీ చేయాలని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

వీడియో ఇదిగో, టర్కీ రాజధాని అంకారాలో ఉగ్రదాడి, ముగ్గురు మృతి, వందలాది మందికి తీవ్ర గాయాలు

గతవారం హెజ్‌బొల్లా.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు నివాసంపై డ్రోన్ల దాడి చేసిన విషయం తెలిసిందే. మొత్తం మూడు డ్రోన్లను ప్రయోగించింది. ఇందులో ఒకటి ఉత్తర ఇజ్రాయెల్‌లోని సెసెరియా నగరంలో ప్రధాని నివాసం ఉన్న భవనాన్ని తాకింది. ఆ సమయంలో ఇంటిలో నెతన్యాహు, ఆయన భార్య లేరని ఇజ్రాయెల్‌ అధికార వర్గాలు తెలిపాయి.

Israeli missile attack Video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement