Four States Assembly Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బీజేపీ జోరు.. తెలంగాణలో ఆధిక్యంలో కాంగ్రెస్.. చత్తీస్‌ గఢ్‌ లోనూ హవా

రాష్ట్రంలోని 146 నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులే లీడ్ లో ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థులు 83 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

Assembly Election 2023 Results Live News

Newdelhi, Dec 3: మధ్యప్రదేశ్ లో (Madhyapradesh) అధికార బీజేపీ (BJP) హవా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 146 నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులే లీడ్ (Lead) లో ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థులు 83 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 116 సీట్లను గెలుచుకోవాలి. కాగా, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపీ అభ్యర్థులు దూసుకెళుతున్నారు. తొలి రౌండ్ లో బీజేపీ అభ్యర్థులు 118 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 68 చోట్ల ముందంజలో ఉన్నారు.  చత్తీస్‌గఢ్‌‌ లో కాంగ్రెస్ 46, బీజేపీ 43, తెలంగాణ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ 63, బీఆర్ఎస్ 39 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Telangana Election Results 2023: సీఎం కేసీఆర్‌కు షాకిస్తున్న ఫలితాలు, 62 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పటివరకు వెలువడిన రౌండ్ల వారీ ఫలితాలు ఇవిగో..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)