Assembly Election 2023 Results Live News Updates: ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరం ముగిసింది.ఐదో రాష్ట్రమైన మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారానికి వాయిదా పడింది. ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన నేతల భవితవ్యం నేడు వెల్లడి కానుంది. కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఫలితాలపై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119.. మ్యాజిక్ ఫిగర్ 60.
తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగగా, ఈవీఎం రౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. రౌండ్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో సాగుతూ అధికార పార్టీ బీఆర్ఎస్ కు షాక్ ఇస్తోంది. కొడంగల్‌తోపాటు కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీకి దిగిన రేవంత్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో ఆయనకే ఆధిక్యం లభించింది. అంతకుముందు పోస్టల్ బ్యాలెట్‌లో మాత్రం బీజేపీ అభ్యర్థి ఆధిక్యం కనబర్చారు. ఇక ఉమ్మడి నిజామాబాద్‌లోని ఐదు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ దూసుకెళ్తోంది.
ఖైరతాబాద్‌లో విజయారెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిక్యంలో ఉండగా, బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, అర్బన్, బోధన్‌లో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో తొమ్మిదింటిలో కాంగ్రెస్, ఒకదాంట్లో సీపీఐ ఆధిక్యంలో ఉంది. గోషామహల్‌లో రాజాసింగ్ ఆధిక్యంలో ఉన్నారు.
నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా తెలంగాణ అసెంబ్లీ బరిలో దిగిన బర్రెలక్క పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నారు. తన నామినేషన్ తో దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ఇప్పుడు ఫలితాల్లోనూ అదే జోరు కనబరుస్తున్నారు. నియోజకవర్గంలోని ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తెలుస్తోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకన్నా కర్నె శిరీష ముందంజలో ఉన్నారు.
ఇప్పటివరకు వెలువడిన రౌండ్ల వారీ ఫలితాలను ఓ సారి చూస్తే..
సిరిసిల్లలో కాంగ్రెస్ ఆధిక్యం
తొలి రౌండ్‌లో కేటీఆర్ వెనుకంజ, 265 ఓట్లతో వెనుకబడిన కేటీఆర్
సిర్పూర్‌లో బీజేపీ ముందంజ
ఎంఐఎం నాలుగు స్థానాల్లో ముందంజ
రెండో రౌండ్‌లో..
రెండో రౌండ్‌లోనూ కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి ముందంజ
1962 ఓట్లతో ముందంజలో రేవంత్
దుబ్బాకలో తొలి రౌండ్‌లో బీఆర్‌ఎస్ ఆధిక్యం
కొడంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ముందంజ, మొదటి రౌండ్ లో 1365 ఓట్ల ఆధిక్యం, కాంగ్రెస్ కు 5503, బీ ఆర్ ఎస్ కు 4138
మొదటి, రెండు రౌండ్లు పూర్తయిన తర్వాత 3500ల లీడ్ లో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క
మొదటి రౌండ్ లో.. కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2380 ఓట్ల ఆధిక్యం.
బీఆర్ ఎస్ అభ్యర్థి మెతుకు ముందంజ, మొదటి రౌండ్ లో 605 ఓట్ల ఆధిక్యం
వర్దన్నపేట 1400 కాంగ్రెస్ తోలి రౌండ్ లీడ్
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు... చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి 312 ఓట్లతో ముందంజ.
పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు 2004 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థి జీ మధుసూదన్ రెడ్డి రెండొ రౌండ్లో 150 ఓట్ల ఆదిక్యం
నకిరేకల్ నియోజకవర్గంలో తొలి రౌండులో వేముల వీరేశం 2408 ఓట్ల ఆధిక్యం
తుంగతుర్తి లో 3600 ఓట్ల ఆధిక్యం లో కాంగ్రెస్ అభ్యర్ధి మందుల సామెల్
కోదాడలో 1500 ఓట్ల మెజార్టీతో ముందున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి
జిల్లాలోని పెద్దపల్లి రామగుండం మంథని నియోజకవర్గాల్లో పూర్తికావస్తున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు .. ఆదిక్యతలో కాంగ్రెస్ ఆ పార్టీ అభ్యర్థులు.
నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ అభ్యర్థి 500 ఓట్లతో ఆధిక్యం
రంగారెడ్ది జిల్లా ఇబ్రహీంపట్నం మొదటి రౌండ్ లో 1383ఓట్ల తో కాంగ్రెస్ ముందంజ..
పాలేరు పొంగులేటి 2230 ఆధిక్యత
నాగార్జున సాగర్ తొలి రౌండ్ : కాంగ్రెస్ : 6051, బీఆర్ఎస్ : 3124, బీజేపీ; 330
నాగర్ కర్నూల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి 800 ఓట్ల ఆదిక్యం
వనపర్తి నియోజకవర్గంలో మొదటి రౌండ్‌లో బీఆర్ఎస్‌కు 739 లీడ్
భూపాలపల్లిలో 1,988 ఓట్లతో కాంగ్రెస్ లీడ్1
మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి blr 1595 ఆధిక్యం
ఖమ్మంలో మొదటి రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యం
నర్సంపేటలో 679 తొలి రౌండ్ బీఆర్ఎస్ లీడ్
పరిగి నియోజకవర్గంలో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి 812 ఓట్ల ఆధిక్యం
మక్తల్ నియోజకవరగంలో తొలిరౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి వాకాటి శ్రీహరి ముదిరాజ్ 1000 ఓట్ల ఆధిక్యత
సత్తుపల్లిలో బీఆర్‌ఎస్ 220 ఓట్లతో సండ్ర ఆధిక్యత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి కోణంనేని సాంబశివరావు అభ్యర్థి మెజారిటీ 2857
బోథ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ యాదవ్ 1210 లీడ్
తాండూరు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి ముందంజ
ఆలేరు నియోజకవర్గంలో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి 760 లీడ్...
వైరాలో కాంగ్రెస్ మలోత్ రామదాసు ఆధిక్యత
మధిర భట్టి కాంగ్రెస్ 2098 ఆధిక్యత
కొత్తగూడెం సీపీఐ కూనంనేని 2856 ఓట్లు ఆధిక్యత
దేవరకద్ర నియోజకవర్గంలో తొలి రౌండ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డి 150 ఓట్ల ఆధిక్యం
తాండూరు నియోజకవర్గంలో మొదటి రౌండ్ లో బీఆర్ ఎస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి ముందంజ
సిద్దిపేటలో బిఅరెస్ అభ్యర్థి హరీష్ రావు తొలి రౌండ్ లో 6300 ఆధిక్యం
భువనగిరి నియోజకవర్గంలో రెండో రౌండ్ లోను కాంగ్రెస్ అభ్యర్థి కుంభ అనిల్ కుమార్ రెడ్డి ఆదిక్యం....
జెడ్చేర్ల నియోజకవరగంలో కాంగ్రెస్ అభ్యర్ధి అనిరుద్ రెడ్డి 408 ఓట్ల ఆధిక్యత
తాండూరు నియోజకవర్గంలో మొదటి రౌండ్ లో బీఆర్ ఎస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డికి 137 ఓట్ల ఆధిక్యం
నాగార్జున సాగర్‌లో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ రెడ్డి రెడ్డి 3 వేల ఓట్ల ఆధిక్యం
హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2000 ఓట్ల అధిక్యం