PM Modi Slams Rahul Gandhi: వీడియో ఇదిగో, 543కి 99 మార్కులు తెచ్చుకుని చిన్న పిల్లోడు మురిసిపోతున్నాడు, రాహుల్ గాంధీపై సెటైర్ వేసిన ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)లోక్‌సభలో మంగళవారంనాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీపై ఛలోక్తులు విసిరారు. రాహుల్‌ను చిన్నపిల్లాడితో పోలుస్తూ, వైఫల్యాల విషయంలో ఆ పిల్లోడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారని అన్నారు

PM Narendra Modi Hits Out at Rahul Gandhi’s Remarks

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)లోక్‌సభలో మంగళవారంనాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీపై ఛలోక్తులు విసిరారు. రాహుల్‌ను చిన్నపిల్లాడితో పోలుస్తూ, వైఫల్యాల విషయంలో ఆ పిల్లోడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారని అన్నారు. మోదీ మాట్లాడుతూ..నాకు ఒక ఘటన గుర్తుకొస్తోంది. ఒక బాలుడు ఉన్నాడు. అతనికి 99 మార్కులు వచ్చాయి. ఆ మార్కుల్ని ప్రతి ఒక్కరికీ చూపిస్తున్నాడు. 99 మార్కులు వచ్చాయని తెలిసి అతన్ని అందరూ అభినందిస్తున్నారు.  వీడియో ఇదిగో, శివుని బొమ్మతో బీజేపీని ఏకి పారేసిన రాహుల్ గాంధీ, హింసని ప్రేరేపించే మిమ్మల్ని హిందువులని ఎలా అనగలమని సూటి ప్రశ్న

అప్పుడు ఒక టీచర్ అక్కడకు వచ్చి, స్వీట్లు ఎందుకు పంచుతున్నావని అడిగింది. ఇంతకూ ఆ పిల్లోడికి 100కి 99 మార్కులు రాలేదు, 543కి 99 మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఆ పిల్లాడికి వైఫల్యాల పరంగా నువ్వు ప్రపంచ రికార్డు సృష్టించావని ఎవరు చెబుతారు?'' అని పరోక్షంగా రాహుల్‌ను ఉద్దేశించి మోదీ పేర్కొనడంతో అధికార పక్షం ఎంపీలు నవ్వులు చిందించారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు గెలుచుకుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now