పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా ప్రకటించారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన తేదీలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగం ఆమోదం పొందిన 75వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 26న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆర్టికల్ 39(బి) ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు, ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వ హక్కుల అంశంపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు

ఈ సమావేశాల్లో 'ఒకే దేశం, ఒకే ఎన్నికల' ప్రతిపాదనతో పాటు వక్ఫ్(సవరణ) బిల్లు - 2024 వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమెదం తెలిపింది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమెదం తెలిపింది.

Parliament Winter Session From Nov 25 To Dec 20

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)