జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఐశ్వర్యానికి మానసిక ,కుటుంబ సంతోషానికి బాధ్యత వహించే గ్రహంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు చంద్రుని రాశి మార్పు కారణంగా 12 రాష్ట్రాల 16 పైన కూడా ప్రభావాలు వస్తాయి. ముఖ్యంగా నవంబర్ 14 వ తేదీన ఉదయం 9 గంటలకు చంద్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా మూడు రాశుల వారికి ప్రతికూల మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి- వృషభ రాశి వారికి చంద్రుడు ధనస్సు రాశిలోకి సంచరించడం వల్ల కొన్ని సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల ప్రవర్తన చికాకును కలిగిస్తుంది. వీరికి ప్రతి విషయంలోనూ కోపం వస్తుంది. దీని కారణంగా స్నేహితులతో గొడవలు పెరుగుతాయి. ఉద్యోగులు తమ పని పట్ల అంత ఆసక్తి ఉండదు. వీరు పనులు సకాలంలో పూర్తి చేయలేరు కాబట్టి వీరిపై అధికారుల నుండి వీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. వ్యాపారస్తులు నష్టాలను చెవి చూస్తారు. ఇది వారి ఆర్థిక పరిస్థితిని క్షీణించేలాగా చేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతాయి. ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది లేకపోతే గొడవలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి

కన్యా రాశి- కన్య రాశి వారికి చంద్రుడు రాశి మార్పు కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. వీరు చేపట్టే ప్రతి పని కూడా ఆలస్యంగా పూర్తి అవుతుంది. యువత కోరుకున్న విజయాన్ని సాధించలేరు. విద్యారంగంలో విద్యార్థులు విజయాన్ని సాధించలేరు. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యులము నుండి మద్దతు లభించదు. దీని ద్వారా విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎత్తైన ప్రదేశాలకు వెళ్లకండి అప్పుల బాధ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్యంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సింహరాశి- సింహరాశి వారికి చంద్రుని రాశి మార్పు కారణంగా కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణంగా ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో వారి ప్రతిష్ట క్షీణించడం వల్ల సమాజంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఉద్యోగస్తులు వారికి కోరుకున్నచోట బదిలీ అవ్వదు. దీని ద్వారా వారు కలత చెందుతారు మీరు కొన్ని పనుల పైన ఆసక్తి చూపించరు. విద్యార్థులు వారి లక్ష్యాలను సాధించలేరు. పోటీ పరీక్షల్లో అంతగా రాణించరు. దీని ద్వారా తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలవుతుంది. ఎత్తైన ప్రదేశాలకు వెళ్లకండి. కోర్టు సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.