Vaikunta Dwara Darshanam: తిరుమలలో జనవరి 2 నుంచి వైకుంఠద్వార దర్శనం... 1వ తేదీ నుంచి టోకెన్ల జారీ
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దర్శన టికెట్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. తిరుపతిలో జనవరి 1వ తేదీ నుంచి 9 చోట్ల టోకెన్లు జారీ చేయనున్నారు.
Tirumala, Dec 27: తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం (Vaikunta Dwara Darshanam) కల్పించనున్నారు. దర్శన టికెట్లు (Tickets) ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. తిరుపతిలో (Tirupati) జనవరి 1వ తేదీ నుంచి 9 చోట్ల టోకెన్లు (Tokens) జారీ చేయనున్నారు. రోజుకు 50 వేల చొప్పున 10 రోజుల పాటు 5 లక్షల టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. 10 రోజుల కోటా పూర్తయ్యేవరకు ఆఫ్ లైన్ విధానంలో నిరంతరాయంగా టోకెన్లు జారీ చేయనున్నారు.
దేశవ్యాప్తంగా నేడు కొవిడ్ ఆసుపత్రుల్లో మాక్‌డ్రిల్.. కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్రం అప్రమత్తం
తిరుపతిలోని శ్రీనివాసం, తుడా ఇందిరా మైదానం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ సత్రాలు, శేషాద్రినగర్ జడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూల్, బైరాగిపట్టెడ జడ్పీ హైస్కూల్ లో టోకెన్లు జారీ చేయనున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)