Newdelhi, Dec 27: ప్రపంచవ్యాప్తంగా మరోసారి కొవిడ్ (Covid) మహమ్మారి సర్వత్రా ఆందోళనకు గురి చేస్తున్నది. డ్రాగన్ దేశం చైనా (China) సహా పలు దేశాల్లో కేసుల (Cases) సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ఈ క్రమంలో కేంద్ర అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మంగళవారం కొవిడ్ (Covid) ఆసుపత్రుల్లో (Hospitals) మాక్ డ్రిల్ (Mock Drill) నిర్వహించనున్నది. ఆసుపత్రుల్లో మాక్‌డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు.
వచ్చే ఏడాది వస్తున్న లూనా ఎలక్ట్రిక్ వెర్షన్.. సెప్టెంబరులో మార్కెట్లోకి..
అలాగే మాక్‌డ్రిల్‌లో పాల్గొనాలని ఆరోగ్యశాఖ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. మహమ్మారి కారణంగా కేసులు భారీగా పెరిగితే ఎదుర్కొనేందుకు సంసిద్ధతను పరీక్షించేందుకు ఈ మాక్‌డ్రిల్‌ను నిర్వహించనున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సఫ్దర్‌జంగ్‌లో ఆసుపత్రిలో పాల్గొననున్నారు. కలెక్టర్లు అవసరమైన మందులు, ప్రాణాలను రక్షించే పరికరాలు, బెడ్ కెపాసిటీ, అంబులెన్స్ సేవల లభ్యతపై పర్యవేక్షించనున్నారు.
#COVID19 | 'Mock Drill' organized at Safdarjung Hospital to ensure the preparedness to deal with any eventuality related to COVID-19@Nitendradd @MoHFW_INDIA pic.twitter.com/wDBwdn6rOs
— DD News (@DDNewslive) December 27, 2022