After Divorce, Woman asks Refund From Photographer: నాలుగేండ్ల తర్వాత విడాకులు.. పెళ్లి ఫోటోలు వెనక్కి తీసుకొని డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఫోటోగ్రాఫర్ కు యువతి మెసేజ్.. ఆ తర్వాత?
పెళ్ళికి తీయించుకున్న ఫోటోలు ఇక పనికిరావని ఓ వింత నిర్ణయం తీసుకుంది. పెళ్లి ఫోటోల కోసం ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలంటూ ఫోటోగ్రాఫర్ కు వాట్సాప్ చేసింది.
Newdelhi, May 9: ఇదో విచిత్ర ఘటన.. దక్షిణాఫ్రికాకు చెందిన యువతికి (South African woman) నాలుగేండ్ల కిందట పెళ్లి అయ్యింది. అయితే, అనుకోని కారణాల వల్ల విడాకుల తంతు కూడా జరిగింది. అయితే, తన పెళ్ళికి తీయించుకున్న ఫోటోలు ఇక పనికిరావని ఓ వింత నిర్ణయం తీసుకుంది. పెళ్లి ఫోటోల కోసం ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలంటూ ఫోటోగ్రాఫర్ (wedding photographer) కు వాట్సాప్ చేసింది. ముందుగా షాక్ అయిన అతను కుదరదని చెప్పాడు. అయితే, లాయర్ నుంచి నోటీసులు పంపిస్తానని యువతి బెదిరించడం గమనార్హం. ప్రస్తుతం ఈ చాటింగ్ వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)