Chicken Rate Down: హైదరాబాద్ లో భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. గత 20 రోజుల్లో 22 శాతం తగ్గిన చికెన్ ధరలు.. కార్తీక మాసం, అయ్యప్ప దీక్ష నేపథ్యంలో తగ్గిన అమ్మకాలు

హైదరాబాద్ లో మొన్నటి దాకా భారీగా ఉన్న చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత 20 రోజుల వ్యవధిలో చికెన్ ధరలు ఏకంగా 22 శాతం తగ్గాయి.

chicken (Photo Credits: Pixabay)

Hyderabad, Nov 24: హైదరాబాద్ లో మొన్నటి దాకా భారీగా ఉన్న చికెన్ ధరలు (Chicken Rate) తగ్గుముఖం పట్టాయి. గత 20 రోజుల వ్యవధిలో చికెన్ ధరలు ఏకంగా 22 శాతం తగ్గాయి. గత నెలలో కిలో రూ.220-240దాకా అమ్మిన చికెన్‌ (Chicken) ఇప్పుడు రూ.160-180కే ఇస్తున్నారు. కార్తీక మాసం కావడం వల్ల నాన్‌ వెజ్‌ (Non-Veg) వినియోగం తగ్గిపోయింది. కార్తీక పూజలు, అయ్యప్ప దీక్ష, ఉపవాసాల వల్ల గృహిణులు నాన్‌ వెజ్‌ వంటకాలను బంద్‌ చేశారు. కార్తీక మాసం ముగిసే వరకు అంటే మరో 20రోజులపాటు నాన్‌ వెజ్‌ వంటలు ఎక్కువ మంది ఇళ్లల్లో చేసే పరిస్థితి లేనందున అప్పటి వరకు చికెన్‌, మటన్‌కు డిమాండ్‌ ఉండే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, తగ్గిన ధరలతో చికెన్ ప్రియులు పండగ చేసుకుంటున్నారు.

Child Rides On Conveyor Belt: ఎయిర్‌ పోర్ట్‌ లోని కన్వేయర్ బెల్ట్‌ పై బాలుడు రైడ్‌.. వీడియో వైరల్‌

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement