Viral Video: బైక్ పై ఆడుకుంటూ కూర్చున్న చిన్నారి ప్రమాదవశాత్తూ రోడ్డుపైకి.. అప్పుడే ట్రక్కు రావడంతో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
రోడ్డుమీదకు చిన్నారులతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తతో వ్యవహరించినా జీవితాంతం బాధ పడాల్సిందే. ఇదీ అలాంటి ఘటనే. ఓ చిన్నారిని బైక్ పై కూర్చోపెట్టి తల్లిదండ్రులు వెళ్లారు.
Hyderabad, Nov 10: రోడ్డుమీదకు చిన్నారులతో (Child) వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తతో వ్యవహరించినా జీవితాంతం బాధ పడాల్సిందే. ఇదీ అలాంటి ఘటనే. ఓ చిన్నారిని బైక్ పై (Bike) కూర్చోపెట్టి తల్లిదండ్రులు వెళ్లారు. చిన్నారి దానితో ఆడుతూ ఉండడంతో బైక్ తో సహా కింద పడింది. అదే సమయంలో ట్రక్కు రావడంతో చిన్నారిపై నుండి దూసుకెళ్లింది. చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)