Viral Video: కదులుతున్న కారు పైకప్పుపై పటాకులు పేల్చిన వ్యక్తి.. ఆ తర్వాత ఏమైంది?

ఓ వ్యక్తి కారు పైకప్పుపై పటాకులు కాల్చాడు (Firecrackers). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Fire Crackers On Car (Credits: X)

Gurugram, Oct 20: హర్యానా (Haryana) గురుగ్రామ్‌ లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారు పైకప్పుపై పటాకులు కాల్చాడు (Firecrackers). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. గురుగ్రామ్‌ (Gurugram) లోని సైబర్‌ సిటీ ప్రాంతంలో గల గోల్ఫ్‌ కోర్స్‌ రోడ్డులో ఓ వ్యక్తి కారులో వెళ్తున్నాడు. ఆ సమయంలో కారు డోర్‌ నుంచి బయటకు వచ్చి పైకప్పుపై (Cars Roof) టపాకులు పెట్టి కాల్చాడు. ఈ దృశ్యాలను వెనుక వస్తున్న ఇతర వాహనదారులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే, ఆ సమయంలో కారుకు నంబర్‌ ప్లేటు లేకపోవడం గమనార్హం. వీడియోపై స్పందించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

TS BJP First List: 65 మంది అభ్యర్థులతో నేడు బీజేపీ తొలి జాబితా??.. నేటి సాయంత్రం తొలి జాబితా ప్రకటన వెలువడవచ్చంటూ ఊహాగానాలు.. నిన్న జేపీ నడ్డా ఇంట్లో పలుమార్లు సమావేశమైన కోర్ కమిటీ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు