Hapur Shocker: వీడియో ఇదిగో, హెల్మెట్ లేదని పెట్రోల్ పోసేది లేదని చెప్పిన సిబ్బంది, కోపంతో పెట్రోల్ బంకుకు కరెంట్ లైన్ కట్ చేసిన లైన్‌మెన్

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఓ పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెల్మెట్‌ లేకుండా వచ్చిన బైకుదారునికి పెట్రోల్ పోసేందుకు నిరాకరించారు. అతడు హెల్మెట్‌ ధరించకపోవడంతో ఇంధనం నింపడానికి అక్కడి సిబ్బంది అంగీకరించలేదు. దాంతో అతడు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.

Lineman Cuts Power to Petrol Pump Over ‘No Helmet, No Petrol’ Rule (Photo Credits: X/@hapurndtv)

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఓ పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెల్మెట్‌ లేకుండా వచ్చిన బైకుదారునికి పెట్రోల్ పోసేందుకు నిరాకరించారు. అతడు హెల్మెట్‌ ధరించకపోవడంతో ఇంధనం నింపడానికి అక్కడి సిబ్బంది అంగీకరించలేదు. దాంతో అతడు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.

ఆగ్రహంతో ఊగిపోతూ ఫ్యూయల్ పంప్‌నకు కరెంట్‌ సరఫరా అయ్యే స్తంభంపైకి ఎక్కి.. విద్యుత్‌ సరఫరాను ఆపేసి వెళ్లిపోయాడు. అతడి చర్యలకు ఆశ్యర్యపోయిన సిబ్బంది విద్యుత్‌ అధికారులను ఆశ్రయించడంతో దాదాపు 20 నిమిషాల తర్వాత వారు కరెంట్‌ సరఫరాను పునరుద్ధరించారు. అనంతరం బంక్‌ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైన్‌మెన్‌ విద్యుత్‌ స్తంభం ఎక్కి సరఫరాను నిలిపివేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అవడంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పెట్రోల్ పోయలేదని ఏకంగా కరెంట్ కట్ చేశాడు...ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో ఘటన, వైరల్‌గా మారిన వీడియో

పెట్రోల్ పోయలేదని ఏకంగా కరెంట్ కట్ చేశాడు

.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement