India's First Glass Bridge: దేశంలోనే మొట్టమొదటి గ్లాస్‌ బ్రిడ్జ్‌ వీడియో ఇదిగో, బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన స్టాలిన్ సర్కారు

తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్లాస్‌ బ్రిడ్జ్‌ (Indias First Glass Bridge)ను నిర్మించింది. బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన ఈ గాజు వంతెన (Glass Bridge)ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోమవారం ప్రారంభించారు.

India's First Glass Bridge Inaugurated In Tamil Nadu (Photo-ANI)

తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్లాస్‌ బ్రిడ్జ్‌ (Indias First Glass Bridge)ను నిర్మించింది. బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన ఈ గాజు వంతెన (Glass Bridge)ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోమవారం ప్రారంభించారు. కన్యాకుమారి (Kanyakumari) తీరంలో వివేకానంద స్మారక మండపానికి 77 మీటర్ల దూరంలో 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో తిరువళ్లువర్‌ విగ్రహాన్ని (Thiruvalluvar statue) ప్రతిష్టించారు. ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగి జనవరి 1వ తేదీకి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో వివేకానంద మండపం, తిరువళ్లువర్‌ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన ఈ గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది.

77 మీటర్ల పొడవు ఉన్న ఈ అద్దాల వంతెన.. 10 మీటర్ల వెడల్పుతో నిర్మించగా.. గ్లాస్ బ్రిడ్జి నిర్మాణ వ్యయం.. రూ.37 కోట్లు అయింది. దీనికి గత ఏడాది మే 24వ తేదీన శంకుస్థాపన చేయగా ఇటీవలే పూర్తయింది. రేపటి నుంచి సిల్వర్‌జూబ్లీ వేడుకల నేపథ్యంలో ఈ గాజు వంతెనను సీఎం స్టాలిన్ ప్రారంభించారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం రెండు రోజులపాటు సిల్వర్‌జూబ్లీ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది.

2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం.. చూసేందుకు ఎగబడ్డ జనం.. మీరూ ఆ వీడియోలు చూడండి..

India's First Glass Bridge

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement