Andhra Pradesh Rains: వరద బాధితుల కోసం రూ. 31 వేలు విరాళం ఇచ్చిన చిన్నారులు, ఈ రోజును గొప్పగా మార్చిందంటూ సీఎం చంద్రబాబు ట్వీట్
చిన్నారులు పెద్ద వాళ్లకు కూడా ఆదర్శం. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం పట్ల స్కూలు యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. దయగల, బాధ్యతగల పౌరుల నేతృత్వంలోని మంచి భవిష్యత్తును ఇలాంటి సంఘటనలు వాగ్దానం చేస్తాయంటూ 'X' లో పోస్ట్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం, పడమర విప్పర్రు గ్రామంలోని శ్రీ విద్యా నికేతన్ పాఠశాలకు చెందిన చిన్నారులు విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి తమ పాకెట్ మనీని విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా 31 వేల రూపాయలు సేకరించి అందించారు. ఈ వీడియోపై చంద్రబాబు స్పందించారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ఈ వీడియో నిజంగా నా విషయంలో ఈ రోజును గొప్పగా మార్చింది. చిన్నారులు పెద్ద వాళ్లకు కూడా ఆదర్శం. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం పట్ల స్కూలు యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. దయగల, బాధ్యతగల పౌరుల నేతృత్వంలోని మంచి భవిష్యత్తును ఇలాంటి సంఘటనలు వాగ్దానం చేస్తాయంటూ 'X' లో పోస్ట్ చేశారు. వీడియో ఇదిగో, భారీ వరదలకు ఉదృతంగా ప్రవహిస్తోన్న కొండ కాలువ, గర్భిణిని ట్రాక్టర్‌పై వాగు దాటించిన గిరిజనులు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)