Gufran Encounter: యూపీలో మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్ గుఫ్రాన్ కాల్చివేత.. గుఫ్రాన్‌పై 13కుపైగా హత్య, దోపిడీ, లూటీ కేసులు

పలు హత్య కేసుల్లో పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్ అయిన క్రిమినల్ గుఫ్రాన్ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

Credits: Twitter

Newdelhi, June 27: ఎన్‌కౌంటర్‌ (Encounter) తో మంగళవారం ఉదయం యూపీ (UP) పరిసరాలు దద్దరిల్లాయి. పలు హత్య కేసుల్లో పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్ (Most Wanted) అయిన క్రిమినల్ గుఫ్రాన్ (Gufran) పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. కౌశంబిలోని ఓ చక్కెర మిల్లు సమీపంలో ఈ తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. స్పెషల్ టాస్క్‌ ఫోర్స్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గుఫ్రాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. గుఫ్రాన్‌పై ప్రతాప్‌గఢ్‌, సుల్తాన్‌పూర్‌లో 13కు పైగా హత్య, లూటీ, దోపిడీ కేసులు ఉన్నాయి. అతడి తలపై రూ. 1.25 లక్షల రివార్డు కూడా ఉంది.

Hospital Horror: అయ్యో.. ఎంత పనిచేశార్రా? మహిళకు భర్త వీర్యానికి బదులు మరో వ్యక్తి వీర్యం ఇచ్చిన ఆసుపత్రి.. కవలలకు జన్మనిచ్చిన మహిళ, డీఎన్ఏ పరీక్షలో బిడ్డకు తన భర్త తండ్రి కాదని వెల్లడి.. తీవ్ర మనోవేదనకు గురై న్యాయపోరాటం.. ఆసుపత్రికి రూ.1.5 కోట్ల జరిమానా

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)