Sedition Law | Representational Image (Photo Credits: Pexels)

Newdelhi, June 27: ధనదాహమే తప్ప.. మనవ సంబంధాలు, ప్రేమ-ఆప్యాయతలు, మనోవేదనలు ప్రైవేటు దవాఖానలకు (Private Hospital) అస్సలు పట్టవని తెలిపే మరో ఘటన ఇది. కృత్రిమ గర్భధారణ చికిత్స (Treatement) కోసం వచ్చిన మహిళకు ఆమె భర్త వీర్యానికి (Sperm) బదులు మరో వ్యక్తి వీర్యం ఇచ్చిన ప్రైవేటు ఆసుపత్రి ఉదంతం ఇది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆ ఆసుపత్రికి భారీ షాక్ ఇచ్చిన ఘటన ఇది. బాధిత దంపతులకు రూ.1.5 కోట్ల పరిహారం చెల్లించాలంటూ ఆసుపత్రి యాజమాన్యాన్ని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్‌సీడీఆర్‌సీ) ఆదేశించింది.

Priyamani: ముస్లింను ఎందుకు పెళ్లిచేసుకున్నావని నన్ను తిట్టారు.. నేనూ ట్రోలింగ్ బారినపడ్డా.. తాజా ఇంటర్వ్యూలో ప్రియమణి వ్యాఖ్యలు

అసలేం జరిగింది..

ఢిల్లీకి చెందిన ఓ జంట అసిస్టెడ్ రిప్రోడక్టివ్ టెక్నిక్‌తో సంతానభాగ్యం పొందేందుకు ఓ ప్రైవేటు  ఆసుపత్రిని ఆశ్రయించారు. ఫలితంగా వారికి 2009లో కవలలు జన్మించారు. ఆ తరువాత శిశువులకు డీఎన్ఏ  పరీక్ష నిర్వహించగా వారి తండ్రి మరొకరని తేలింది. దీంతో, ఆసుపత్రి వారి పొరపాటు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు న్యాయపోరాటం ప్రారంభించారు. తమకూ సదరు ఆసుపత్రి రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై కొన్నేళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరగ్గా తాజాగా వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది. బాధిత దంపతులకు రూ.1.5 కోట్ల పరిహారం చెల్లించాలంటూ ఆసుపత్రి యాజమాన్యాన్ని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్‌సీడీఆర్‌సీ) ఆదేశించింది. కృత్రిమ గర్భధారణ విధానాల సాయంతో జన్మించిన శిశువు డీఎన్ఏ ప్రొఫైల్ తయారు చేసి ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని ఈ సందర్భంగా కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

Kapu Ramachandra Reddy: విలేకరులను వ్యభిచార గృహాల్లోని బ్రోకర్లుగా అభివర్ణించిన వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. ‘గడపగడపకు మన ప్రభుత్వం’పై తప్పుడు రాతలు రాశారంటూ ఆగ్రహం