Priyamani (Credits: Twitter)

Hyderabad, June 27: ‘పెళ్లైన కొత్తలో’ (Pellaina Kotthalo), ‘గోలీమార్’ (Golimaar), ‘యమదొంగ’ (Yamadonga) వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ నటి ప్రియమణి (Priyamani) పెళ్లి తరువాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. తాను కూడా ట్రోలింగ్ (Trolling) బారిన పడ్డానని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. తన పెళ్లి విషయంలో కొందరు నెటిజన్లు నోరు పారేసుకున్నారని అన్నారు. ‘ట్రోలింగ్‌ను నేను పెద్దగా పట్టించుకోను. బాడీ షేమింగ్, మేని ఛాయ విషయంలో ఇప్పటికీ నాపై విమర్శలు వస్తూనే ఉంటాయి. అయితే, ముస్తఫాను లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు సోషల్ మీడియాలో నేను చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నా’ అన్నారు.

Kapu Ramachandra Reddy: విలేకరులను వ్యభిచార గృహాల్లోని బ్రోకర్లుగా అభివర్ణించిన వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. ‘గడపగడపకు మన ప్రభుత్వం’పై తప్పుడు రాతలు రాశారంటూ ఆగ్రహం

కొందరు తిట్టారు

‘మా నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసినప్పుడు ‘నువ్వు ముస్లింను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు’ అని కొందరు తిట్టారు. ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్లందరికీ నేను చెప్పేది ఒకటే. ఇది నా లైఫ్. ఎవరితో జీవితాన్ని పంచుకోవాలనేది పూర్తిగా నా ఇష్టం’ అని ప్రియమణి తేల్చి చెప్పారు.

Tomato prices: ‘నైరుతి’ ఆలస్యం.. టమాటా మంట.. దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర రూ.100 ఆపైనే.. వర్షాలు లేక కూరగాయల ధరల పెరుగుదల