Vijayawada, June 27: అనంతపురం జిల్లా (Ananthapuram) రాయదుర్గం (Rayadurgam) ఎమ్మెల్యే (MLA), ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి (Kapu Ramachandra Reddy) మీడియా ప్రతినిధులపై ఊగిపోయారు. కొన్ని చానళ్లలో పనిచేసే విలేకరులు వ్యభిచార గృహాల్లోని బ్రోకర్ల కంటే హీనమని తీవ్రమైన పదజాలంతో విరుచుపడ్డారు. అలాంటివారు ఆ ఉద్యోగాలు వదిలి బయటకు వచ్చి కొబ్బరి బోండాలు అమ్ముకుంటే కాస్తంత మర్యాదగానైనా ఉంటుందని సలహా ఇచ్చారు. రాయదుర్గంలోని ఆర్అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అసలేమైంది అంటే??
బొమ్మనహాల్ మండలం గౌనూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణపై మీడియా చానళ్లు, పత్రికలు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. గ్రామస్థులు పత్తిపొలాల్లో పనులకు వెళ్లారని, వారొచ్చిన తర్వాత కలిసి ఫొటోలు తీయించుకున్నామంటూ ఇష్టమొచ్చినట్టు వార్తలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతుంటే ఓర్వలేక ఇలాంటి వార్తలు రాస్తున్నారంటూ బూతులు తిట్టారు.