Viral Video: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ని ఇబ్బందిపెట్టిన గొడుగు.. పాపం అలాగే వానలో తడుస్తూ.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాట్లు, పొరపాట్లకు సంబంధించి గతంలో అనేక వీడియోలో వైరల్ అయ్యాయి. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న మరో వీడియో నెటిజన్లు ఆశ్చర్యపరుస్తోంది. గొడుగు తెరిచేందుకు ఇబ్బంది పడ్డ బైడెన్ వీడియో ఇది.
Newyork, May 21: అమెరికా అధ్యక్షుడు (American President) జో బైడెన్ (Joe Biden) ను తెరుచుకోకుండా ఓ గొడుగు (Umbrella) కాసేపు ఇబ్బంది పెట్టింది. ఇటీవల బైడెన్ జపాన్ (Japan) పర్యటనకు వెళ్లారు. అయితే, ఆయన జపాన్‌లో లాండయ్యే సమయానికే చినుకులు (Rain) మొదలయ్యాయి. దీంతో, బైడెన్ విమానం దిగుతూ తన వద్ద ఉన్న పెద్ద గొడుగును తెరిచే ప్రయత్నం చేశారు. కానీ, అది ఎంతకీ తెరుకుకోకుపోవడంతో ఆయన దాన్ని అలాగే పట్టుకుని ఎదురుగా ఉన్న జపాన్ ప్రతినిధులకు అభివాదం చేశారు. ఈ క్రమంలో బైడెన్ వానలో కాస్తంత తడవాల్సి వచ్చింది. ఈలోపు, బైడెన్ ఇబ్బందిని గమనించిన అమెరికా అధికారులు తమవద్ద ఉన్న గొడుగును పట్టేప్రయత్నం చేస్తారు. ఆ తరువాత బైడెన్ మరోసారి ప్రయత్నించడంతో గొడుగు తెరుచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Fire Accident In Hyderabad: హైదరాబాద్ లో హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)