IPL 2022: రూ.6.5 కోట్లు పెట్టి కొంటే గల్లీ క్రికెట్ కంటే దారుణంగా ఆడుతున్నాడు, అభిషేక్ శర్మపై విమర్శలు గుప్పిస్తున్న ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు
అభిషేక్ శర్మపై ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "హైదరాబాద్ తీరు మారదు. రూ. 6.5 కోట్లు పెట్టి అభిషేక్ శర్మను ఎందుకు కొన్నారో.. గల్లీ క్రికెట్ కంటే దారుణంగా ఆడుతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌కు రూ. 6.5 కోట్లు దండగ’’ అని అభిమానులు మండిపడుతున్నారు
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు మారినా.. ఆట తీరు మాత్రం మారడం లేదు. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటికీ ఆఖరి స్థానంలోనే ఉంది. తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో 61 పరుగుల తేడాతో ఓటమి చెందిన ఎస్‌ఆర్‌హెచ్.. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ.6.5 కోట్లు వెచ్చించి ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసిన అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అభిషేక్ శర్మపై ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "హైదరాబాద్ తీరు మారదు. రూ. 6.5 కోట్లు పెట్టి అభిషేక్ శర్మను ఎందుకు కొన్నారో.. గల్లీ క్రికెట్ కంటే దారుణంగా ఆడుతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌కు రూ. 6.5 కోట్లు దండగ’’ అని అభిమానులు మండిపడుతున్నారు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో వంటి స్టార్ ఆటగాళ్లను విడిచి పెట్టి అభిమానుల ఆగ్రహానికి గురైన ఎస్‌ఆర్‌హెచ్.. ప్రస్తుత ఆట తీరుతో మరిన్ని విమర్శలు మూటగట్టుకుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)