IPL 2022: ఎందుకంత ప్రస్టేషన్ ఇషాన్ కిషన్, అవుడయ్యాడని బౌండరీ రోప్‌ను బలంగా బ్యాట్‌తో బాదిన ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, వీడియో వైరల్
ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 బంతులు ఎదర్కొన్న కిషన్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ముంబై ఇన్నింగ్స్ 7 ఓవర్ వేసిన మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో.. సింగిల్ తీయడానికి ప్రయత్నించిన కిషన్ బౌల్డయ్యాడు.
ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 బంతులు ఎదర్కొన్న కిషన్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ముంబై ఇన్నింగ్స్ 7 ఓవర్ వేసిన మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో.. సింగిల్ తీయడానికి ప్రయత్నించిన కిషన్ బౌల్డయ్యాడు. ఈ క్రమంలో నిరాశకు గురైన కిషన్ పెవిలియన్‌కు వెళ్తూ బ్యాట్‌తో బౌండరీ రోప్‌ను బలంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కిషన్ చర్య ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మ్యాచ్ రిఫరీ అతడిపై జరిమానా విధించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 17 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)