IPL 2022: ముంబైకి మళ్లీ భారీ షాక్, స్లో ఓవర్‌రేట్‌ కారణంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు రూ. 24 లక్షలు జరిమానా, . అతడితో పాటు జట్టు సభ్యలుకు రూ. 6 లక్షలు జరిమానా

స్లో ఓవర్‌రేట్‌ కారణంగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు మరోసారి భారీ జరిమానా పడింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయనందుకు అతడిపై రూ. 24 లక్షల జరిమానా ఐపీఎల్‌ నిర్వహకులు విధించారు.

Mumbai Indians captain Rohit Sharma

ఐపీఎల్‌-2022లో వరుస ఓటుముల బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌రేట్‌ కారణంగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు మరోసారి భారీ జరిమానా పడింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయనందుకు అతడిపై రూ. 24 లక్షల జరిమానా ఐపీఎల్‌ నిర్వహకులు విధించారు. అతడితో పాటు జట్టు సభ్యలుకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. కాగా అంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్‌ శర్మ స్లో ఓవర్‌రేట్‌ కారణంగా ఫైన్‌ను ఎదుర్కొన్నాడు. ఇక రోహిత్‌ మూడో సారి స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడితే రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్‌ నిషేధం ఎదుర్కొంటాడు.