Viral Video: ఇండియా-బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య గొడవ.. వీడియో వైరల్!
శ్రీలంకలో జరుగుతున్న ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ మెన్స్ ఆసియాకప్ 2023లో ఆసక్తికర ఘటన జరిగింది. నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 51 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా జూనియర్ జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించింది.
Newdelhi, July 22: శ్రీలంకలో (Srilanka) జరుగుతున్న ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ మెన్స్ ఆసియాకప్ 2023లో (Asia Cup 2023) ఆసక్తికర ఘటన జరిగింది. నిన్న బంగ్లాదేశ్‌తో (Bangladesh) జరిగిన సెమీఫైనల్‌లో 51 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా (Team India) జూనియర్ జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించింది. రేపు (ఆదివారం) కొలంబోలో జరగనున్న ఫైనల్‌లో భారత్-పాక్ జట్లు తలపడతాయి.మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్-ఎ ఆటగాడు సౌమ్య సర్కార్, ఇండియా-ఎ పేసర్ హర్షిత్ రాణా మధ్య మైదానంలో గొడవ జరిగింది. యువరాజ్ సిన్హ్ దోడియా బౌలింగులో నికిన్ జోస్‌కు క్యాచ్ ఇచ్చి సౌమ్య సర్కార్ అవుటయ్యాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో సౌమ్య సర్కార్ కు హర్షిత్ రాణా సెండాఫ్ ఇవ్వడం ఉద్రిక్తతకు కారణమైంది. సహనం కోల్పోయిన సౌమ్య అతడితో గొడవకు దిగాడు. అంపైర్ ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.