Rohit Sharma Eats Barbados Grass: భారత్ విశ్వవిజేతగా నిలిచిన శుభవేళ.. బార్బడోస్ మైదానంలోని గరికను తిన్న రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో
దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్ ను మరోసారి గెలుచుకుని జగజ్జేతగా నిలిచింది. ఊరూ-వాడా, పిల్లా-జల్లా అని తేడా లేకుండా ప్రతీ భారతీయుడు ఈ మధుర విజయ క్షణాలను ఆస్వాదిస్తున్నారు.
Newdelhi, June 30: దక్షిణాఫ్రికాను (South Africa) ఓడించి భారత (India Team) జట్టు T20 ప్రపంచ కప్ (T20 World Cup) ను మరోసారి గెలుచుకుని జగజ్జేతగా నిలిచింది. ఊరూ-వాడా, పిల్లా-జల్లా అని తేడా లేకుండా ప్రతీ భారతీయుడు ఈ మధుర విజయ క్షణాలను ఆస్వాదిస్తున్నారు. 2007 తొలిసారి టీమిండియా ధోనీ కెప్టెన్సీలో టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు 2024లో రెండో సారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. భారత్ ఛాంపియన్ గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించి ఎమోషనల్ మూమెంట్స్ కనిపించాయి. ఈ ఆనంద క్షణాల్లో కొంచం ఎమోషనల్ అయిన రోహిత్.. బార్బడోస్ మైదానంలోని గరికను తింటూ కనిపించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)