Andhra Pradesh Shocker: చిత్తూరు జిల్లాలో దారుణం, డ్రైవర్‌ని బస్సుతో తొక్కించి కిలో మీటర్ దూరం లాక్కెళ్లిన మరో బస్సు డ్రైవర్, యాక్సిడెంట్ సీసీ కెమెరాలో రికార్డ్
చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మహా సముద్రం టోల్‌గేట్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్‌ని.. మరో బస్సు డ్రైవర్ బస్సుతో తొక్కించి హతమార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్నింగ్ స్టార్, శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సుల డ్రైవర్లు వాగ్వాదం హద్దు మీరి ఈ హత్యకు కారణమైంది. ప్రాణాలు కోల్పోయిన సుధాకర్ రాజుది గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెం కాగా నిందితుడు డ్రైవర్ శ్రీనివాసరావు విజయవాడ అయ్యప్పనగర్ యనమలకుదురు రోడ్డులో నివాసం ఉంటున్నాడు. కథనంలోకి వెళితే.. ఓ బస్సు అద్దం మరో బస్సుకు తగలడంతో.. రెండు బస్సుల డ్రైవర్లు బస్సుల్ని ఆపి ఘర్షణపడ్డారు. వీడియో ఇదిగో, చిన్న గొడవకే డ్రైవర్‌ని బస్సుతో తొక్కించి చంపిన మరో డ్రైవర్, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన యాక్సిడెంట్ వీడియో
ఘర్షణ అనంతరం శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు టోల్ గేట్ దగ్గర నుంచి ముందుకు కదిలింది.అయితే మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ డ్రైవర్ సుధాకర్ రాజు బస్సు దిగి దానికి అడ్డంగా నిలబడ్డాడు. శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు కోపంతో అతనిపై నుండి బస్సును పోనివ్వడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. కాగా అతన్ని బస్సు సుమారు కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లడంతో మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
మహాసముద్రం టోల్‌గేటు దగ్గరున్న సీసీ కెమెరాలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు సుధాకర్‌రాజు తొక్కించుకుంటూ వెళ్లడం రికార్డైంది. టోల్‌గేట్ దగ్గర సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న బంగారుపాళ్యం పోలీసులు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. అతడిపై 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేశారు.శ్రీకృష్ణ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కూడా బంగారుపాళ్యం పోలీసులు పిలిచి ప్రశ్నిస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)