Andhra Pradesh Crime: ఏలూరులో దారుణం, కన్న కూతుర్లకు రెండో భర్తతో కడుపు చేయించిన తల్లి, ట్విస్ట్ ఏంటంటే..
ఏలూరులోని వట్లూరు గ్రామ పంచాయతీకి చెందిన ఓ వివాహిత (38) భర్త అనారోగ్యంతో 2007లో మరణించగా ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. తరువాత పుట్టా సతీష్ పవన్ కుమార్ (43) అనే యువకుడిని వివాహం చేసుకుంది
ఏలూరులోని వట్లూరు గ్రామ పంచాయతీకి చెందిన ఓ వివాహిత (38) భర్త అనారోగ్యంతో 2007లో మరణించగా ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. తరువాత పుట్టా సతీష్ పవన్ కుమార్ (43) అనే యువకుడిని వివాహం చేసుకుంది. ఆమెకు సంతానం కలగదని భావించిన సతీష్ కుమార్ మరో మహిళ ద్వారా సంతానం పొందుతానని చెప్పడంతో.. ఆమె తన ఇద్దరు కుమార్తెలు ఈడుకొచ్చారని, వారి ద్వారా సంతానం పొందాలని సూచించింది. పెద్ద కుమార్తె 8వ తరగతి చదువుతున్న సమయంలో కన్న తల్లి ఆమెను సతీష్ కుమార్ వద్దకు పంపించింది.
ఆ చిన్నారి ప్రతిఘటించినా వారిద్దరూ కలిసి చావబాదారు. ఆమె గర్భం దాల్చడంతో చదువు ఆగి, అందరికీ తెలిసిపోతుందని భయపడి అబార్షన్ చేయించారు. చివరకు పదో తరగతిలోకి రావడంతో మరోసారి ఆ విద్యార్థినిని గర్భవతిని చేశారు. 2021 జూన్ 3న పాప జన్మించింది. అయితే మగ బిడ్డ కావాలని సతీష్ చెప్పడంతో ఈసారి తన రెండో కుమార్తె (16)ను పంపింది. ఆమె కూడా గర్భం దాల్చ డంతో ఇంటిలోనే డెలివరీ చేశారు. ప్రాణం లేని మగశిశువు పుట్టడంతో ఆ బిడ్డను కాలువలో పడవేశారు.
ఇటీవల సతీశ్‌కు, ఆమెకు గొడవలు రావడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లి పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు పెట్టింది. విషయం మేనమాకు తెలిసి.. బుధవారం ఏలూరు చేరుకుని ఆడపిల్లలిద్దరినీ తీసుకుని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వీరి బండారం అంతా బయటపడింది. ప్రస్తుతం పెద్ద కుమార్తె మూడో నెల గర్భిణి అని పోలీసులు గుర్తించారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)