Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాలో పుణ్యస్నానం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు, త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబం

పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. మహా కుంభమేళాలో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులిచ్చారు.

Pawan Kalyan and his wife Take Holy dip at Prayagraj (Photo/Video Grab)

పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. మహా కుంభమేళాలో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులిచ్చారు. ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న కుంభమేళాకు (Kumbh Mela) సామాన్యభక్తులతో పాటు ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

ఇక మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. సంబంధిత ఫొటోను ఆయన ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. మహా కుంభమేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మత, ఆధ్యాత్మిక వేడుక అన్నారు. సనాతన సంప్రదాయం, వారసత్వానికి ఇదో గొప్ప ప్రతీకగా పేర్కొన్నారు. దేశం ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉండాలని గంగామాతను ప్రార్థించినట్లు తెలిపారు.

త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన నారా లోకేష్ దంపతులు, ఫిబ్రవరి 26న ముగియనున్న మహా కుంభమేళా

ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా కొనసాగుతోన్న కుంభమేళాలో మంగళవారం సాయంత్రానికి 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. జనవరి 13న మొదలైన ఈ ఆధ్యాత్మిక సంబరం ఫిబ్రవరి 26వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. భారత్‌లోని 110 కోట్ల మంది సనాతనుల్లో దాదాపు సగం మంది పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించారని తెలిపింది. ఫిబ్రవరి 26నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మహా కుంభమేళాలో పుణ్యస్నానం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

UP Shocker: దారుణం, పని మనిషికి మద్యం తాగించి అత్యాచారం చేసిన యజమాని కొడుకు, భర్త తలకు తుఫాకీ గురిపెట్టి అతని కళ్లెదురుగానే నీచమైన చర్య

Uttar Pradesh Shocker: దారుణం, కట్నం తీసుకురాలేదని భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన భర్త, ఆరోగ్యం క్షీణించడంతో నిజాలు వెలుగులోకి, అత్తింటివారిని అరెస్ట్ చేసిన పోలీసులు

Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో 55 కోట్లు దాటిన పుణ్యస్నానం ఆచరించిన భక్తుల సంఖ్య, ఈ రోజు ఒక్కరోజే 99.20 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు

Share Now