ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో (Maha Kumbh Mela) ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara lokesh) దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు. పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు.

40 కోట్ల మంది అనుకుంటే 50 కోట్లు దాటిపోయారు, కుంభమేళాలో 53 కోట్ల మంది పుణ్య స్నానాలు, రికార్డు స్థాయిలో పోటెత్తుతున్న భక్తులు

జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు సాగే మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళ్తున్నారు. కోట్లలో భక్తులు త్రివేణీ సంగమంలో స్నాణాలు ఆచరిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఏకంగా 53 కోట్ల మంది భక్తులు స్నానమాచరించారని ఇది చరిత్రలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక తీర్థయాత్రగా యూపీ సర్కార్ పేర్కొంది.

Nara Lokesh family takes a holy dip at Maha Kumbh Mela

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)