ప్రయాగ్‌రాజ్‌ లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్య‌లో భ‌క్తులు పోటెత్తుతున్నారు. కోట్లాదిగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళా ప్రారంభమైన గ‌త నెల 13వ తేదీ నుంచి ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించిన‌ట్లు అధికారులు వెల్లండించారు.

త్రివేణి సంగంమంలో పుణ్యస్నానం ఆచరించిన 50 కోట్ల మంది భక్తులు, చైనా మినహా అన్ని దేశాల జనాభాను ఈ సంఖ్య దాటేసిందని తెలిపిన యూపీ ప్రభుత్వం

త్రివేణి సంగమంలో ఇప్ప‌టి వరకూ 53 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ సర్కార్‌ ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే ఇంత మంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది. కాగా, జనవరి 13న ప్రారంభమైన‌ మహాకుంభమేళా... ఈ నెల‌ 26 వ‌ర‌కు కొనసాగనుంది. దాదాపు 45 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మానికి ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు.

Maha Kumbh Mela 2025

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)