Jagan Hires Personal Security: వీడియో ఇదిగో, తాడేపల్లి జగన్ నివాసం వద్ద 30 మందితో ప్రైవేట్ సెక్యూరిటీ, జగన్ ఇంటి ముందున్న రోడ్డుపై ఆంక్షలు తొలగించిన ప్రభుత్వం
జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం ముందు నుంచి సామాన్య ప్రజలు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం వద్ద 30 మందితో ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.జగన్ నివాసం వద్ద పోలీసు సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం ముందు నుంచి సామాన్య ప్రజలు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. తాజాగా వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రుషికొండ ప్యాలెస్ లో విలాసాలపై స్పందించిన వైఎస్సార్సీపీ, అధికారిక ప్రకటన ఇదిగో
జగన్ ఇంటి ముందున్న రోడ్డుపై ఆంక్షలు తొలగించింది. దీంతో ఆ రోడ్డు ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు అందుబాటులోకి వచ్చింది. రహదారికి రెండు వైపులా పోలీసు చెక్ పోస్టులు ఉంచింది. దీంతో ఆ ప్రాంతాల గుండా ప్రజల రాకపోకలు మొదలయ్యాయి. జగన్ నివాసం వద్ద పోలీస్ సెక్యూరిటీని కూడా ప్రభుత్వం తొలగించడంతో ప్రైవేట్ సెక్కూరిటీతో భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 30మంది కొత్త వారితో జగన్ నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)