Tirupati Deputy Mayor Election: వీడియో ఇదిగో, గతి లేక టీడీపీకి ఓటేశామంటూ భూమన కాళ్లు పట్టుకుని ఏడ్చిన కార్పోరేటర్లు, తప్పు అయిందంటూ కాళ్లమీద పడి క్షమాపణ
డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి నివాసానికి టీడీపీకి ఓటేసిన నలుగురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు వచ్చారు. బెదిరించి కూటమికి ఓట్లు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు అయిందంటూ భూమన కాళ్లమీద పడి క్షమాపణ కోరారు.
ఉత్కంఠభరితంగా సాగిన తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికల్లో కూటమి నేతలు విజయం సాధించారు. డిప్యూటీ మేయర్ గా అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. తమను కొట్టి బెదిరించారంటూ నలుగురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మాజీ మంత్రి, భూమన కరుణాకర్‌రెడ్డి కాళ్ల మీద పడి క్షమాపణలు కోరారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి నివాసానికి టీడీపీకి ఓటేసిన నలుగురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు వచ్చారు. బెదిరించి కూటమికి ఓట్లు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు అయిందంటూ భూమన కాళ్లమీద పడి క్షమాపణ కోరారు. కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనీష్, మోహన్ యాదవ్, అనిల్, అమర్నాథ్ రెడ్డి అనే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ వారిని మీడియా ముందు ప్రవేశపెట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన.
గతి లేక టీడీపీకి ఓటేశామంటూ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కాళ్ళు పట్టుకొని ఏడ్చిన వైసీపి కార్పొరేటర్లు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)