Andhra Pradesh: ఏపీలో ఇంకా అభివృద్ధికి దూరంగానే గ్రామాలు, నిండు గర్భిణికి నొప్పులు రావడంతో డోలీలోనే 6 కిలోమీటర్లు మోసుకువెళ్లిన బందువులు

Andhra Pradesh: Pregnant woman carried in 'Doli' for six kilometres for delivery

ఏపీలో ఇంకా అభివృద్ధికి దూరంగానే కొన్ని గ్రామాలు ఉండిపోయాయి. నిండు గర్భిణికి నొప్పులు రావడంతో డోలీలోనే 6 కిలోమీటర్లు బంధువులు మోసుకువెళ్లారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయితీ పరిధిలోని పితృగడ్డ కొండ శిఖరంలో కొర్ర దేవి అనే గర్భిణీకి అర్ధరాత్రి 12 గంటల సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యుల సహకారంతో డోలీ కట్టుకుని ఆర్ల గ్రామం వరకు 6 కి.మీ మోసుకుని వెళ్లాడు భర్త కొర్ర రమేష్. 108కి ఫోన్ చేయగా అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో.. ప్రైవేటు ఆటో రప్పించుకుని అక్కడి నుంచి బుచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

శవాన్ని దహనం చేయాలంటే ప్రాణాలకు తెగించాల్సిందేనా, తిరుపతి జిల్లాలో ఆ ఊరి ప్రజలకు ఇన్ని ఇబ్బందులా...వీడియో ఇదిగో

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement