Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో సస్పెండ్, ఆహారం అందలేదని ప్రశ్నించినందుకు చెంప పగలగొట్టిన జయలక్ష్మి
విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మి తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. వీఆర్వోను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన వెల్లడించారు. ఆమెకు షోకాజ్ నోటిసులు ఇచ్చినట్లు తెలిపారు.
విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మి తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. వీఆర్వోను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన వెల్లడించారు. ఆమెకు షోకాజ్ నోటిసులు ఇచ్చినట్లు తెలిపారు. మంచినీరు, ఆహారం తమ వీధిలోకి అందలేదని విజయవాడలో వరద బాధితులు ప్రశ్నించినందుకు వీఆర్వో జయలక్ష్మి ఒకరి చెంప పగలగొట్టారు. అక్కడితో ఆగకుండా పోలీసులు ముందే బాధితుడిని దుర్భాషలాడారు. నన్నే ప్రశ్నిస్తావా?అంటూ బాధితులపైనే అధికారులకు ఫిర్యాదు చేశారు. వీడియో ఇదిగో, భారీ వరదలకు ఉదృతంగా ప్రవహిస్తోన్న కొండ కాలువ, గర్భిణిని ట్రాక్టర్‌పై వాగు దాటించిన గిరిజనులు
భోజనాలు, మంచినీరు అందటం లేదని ప్రశ్నించినందుకు ఇలా ఓ వీఆర్వో, వరద బాధితులపై చేయి చేసుకోవడం వివాదానికి దారి తీసింది. ఆమె వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)