Andhra Pradesh Shocker: విజయవాడలో ఘోర విషాదం, ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి, ఆర్థిక ఇబ్బందులే కారణమా..

ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు డి.శ్రీనివాస్‌ (40)తో పాటు ఆయన భార్య ఉష (38) , ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్‌ (8), తల్లి రమణమ్మ (65) మరణించారు.మంగళవారం ఉదయం పని మనిషి ఇంటికి వెళ్లి చూడగా బాల్కనీలో శ్రీనివాస్‌ ఉరేసుకుని కనిపించారు.

Suicide (file Image)

విజయవాడ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పటమట ప్రాంతంలో ఒకే కుటుంబంలో ప్రముఖ వైద్యుడు సహా ఐదుగురు మృతి చెందారు. స్థానికంగా నివాసముంటున్న ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు డి.శ్రీనివాస్‌ (40)తో పాటు ఆయన భార్య ఉష (38) , ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్‌ (8), తల్లి రమణమ్మ (65) మరణించారు.మంగళవారం ఉదయం పని మనిషి ఇంటికి వెళ్లి చూడగా బాల్కనీలో శ్రీనివాస్‌ ఉరేసుకుని కనిపించారు. వెంటనే ఆమె చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించారు.  కేరళ, బీహార్‌ రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు, 11 మంది అక్కడికక్కడే మృతి, పలువురికి తీవ్ర గాయాలు

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంటి లోపల శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాలు ఉన్నాయని.. వాళ్ల గొంతులు కోసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్‌ ఇటీవల ఆస్పత్రి పెట్టారు. నష్టాలు రావడంతో దాన్ని అమ్మేశారు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. దీంతో ఆయనే కుటుంబాన్ని హతమార్చి ఆపై ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement