కేరళ, బీహార్ రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు (Accident) చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో సుమారు 11 మంది దుర్మరణం పాలయ్యారు. బీహార్ (Bihar)లోని బగల్పూర్ (Bhagalpur)లో ఓ ట్రక్కు ఎస్‌యూవీ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఆమపూర్ గ్రామంలోని గోఘా పోలీసు స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 80పై సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ముంగేర్‌లోని ధాపరి నుంచి కహల్‌గావ్‌లోని శ్రీమత్‌పూర్‌లో జరుగుతున్న ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కొందరు ఎస్‌యూవీలో బయలుదేరారు. కారు గోఘా పోలీసు స్టేషన్ పరిధిలోకి రాగానే.. రాడ్‌ల లోడు లారీ టైర్ పేలడంతో కారుపై బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
కేరళ రాష్ట్రం కన్నూర్‌లో సోమవారం రాత్రి ఓ కారు, లారీ ఢీ కొన్నాయి. పున్నచ్చేరిలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Here's Video
Six dead after truck suffers tyre burst, overturns on car in Bihar's Bhagalpur
Read @ANI Story | https://t.co/QRu891XroW#Bihar #bhagalpur #accident pic.twitter.com/Ke8pkBcBfF
— ANI Digital (@ani_digital) April 30, 2024
#WATCH | Kannur, Kerala: Five people died in a collision between a car and a lorry in Punnacherry, Kannur last night. The driver of the lorry sustained injuries in the accident. Further probe is underway, say police pic.twitter.com/8sQxv3BfN2
— ANI (@ANI) April 30, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)