Cyclone Michaung Alert: నెల్లూరు జిల్లాలో తీరం దాటుతున్న మైచాంగ్ తుపాను.. మైపాడు బీచ్ వద్ద తీరం దాటే ప్రక్రియ మొదలు

గత రెండ్రోజులుగా తమిళనాడుతో పాటు ఏపీ తీర ప్రాంతాన్ని వణికించిన తీవ్ర తుపాను మైచాంగ్ నెల్లూరు జిల్లాలో భూభాగంపైకి ప్రవేశిస్తోంది. జిల్లాలోని మైపాడు బీచ్ వద్ద తుపాను తీరం దాటే ప్రక్రియ మొదలైంది.

Cyclone Michaung (Photo Credit: IMD)

Hyderabad, Dec 5: గత రెండ్రోజులుగా తమిళనాడుతో (Tamilnadu) పాటు ఏపీ (AP) తీర ప్రాంతాన్ని వణికించిన తీవ్ర తుపాను మైచాంగ్ (Cyclone Michaung) నెల్లూరు జిల్లాలో భూభాగంపైకి ప్రవేశిస్తోంది. జిల్లాలోని మైపాడు బీచ్ వద్ద తుపాను తీరం దాటే ప్రక్రియ మొదలైంది. ఇది గత 6 గంటలుగా 10 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోంది. ఇది క్రమంగా బలహీనపడే అవకాశాలున్నాయి. తుపాను ప్రభావంతో ఇప్పటివరకు బాపట్లలో 213.6 మిల్లీమీటర్లు, నెల్లూరులో 209.5 మిల్లీమీటర్లు, మచిలీపట్నంలో 149.3 మిల్లీమీటర్లు, కావలిలో 142.6 మిల్లీమీటర్లు, ఒంగోలులో 114.4 మిల్లీమీటర్లు, కాకినాడలో 59 మిల్లీమీటర్లు, నరసాపురంలో 58.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Free Treatment for Road Accident Victims: రోడ్డు ప్రమాద బాధితులకు డబ్బులు లేకుండానే చికిత్స.. యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement