Newdelhi, Dec 5: సకాలంలో వైద్య చికిత్స అందక రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) గాయపడ్డవారిలో చాలామంది మృత్యువాతపడుతున్నారు. డబ్బులు (Cash) లేని కారణంగా చికిత్స ఆలస్యమవుతున్న సందర్భాలు అనేకం. దీనిని అధిగమించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) అడుగులు వేస్తోంది. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. మోటారు వాహనాల సవరణ చట్టం 2019లో భాగంగా దీనిని తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిసింది. మూడు, నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ఉచిత వైద్య చికిత్స అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.
Accidents: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స.. త్వరలో దేశవ్యాప్తంగా అమలు | centre plans to introduce cashless treatment of accident victims across india official https://t.co/m7F8pp4YAJ
— V. Venkata Ramana (@vvratkvc) December 4, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)