Newdelhi, Dec 5: 2022లో మహిళలపై (Women) నేరాలు 4 శాతం మేర పెరిగాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ-NCRB) వెల్లడించింది. భర్త లేదా అతడి బంధువుల క్రూరత్వమే మహిళలపై నేరాలలో అధికమని పేర్కొంది. ఇక పిల్లలపైనా నేరాలు అధికమవుతున్నాయని, 2022లో నేరాలు ఏకంగా 8.7 శాతం మేర పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2022 ఏడాదిలో దేశవ్యాప్తంగా 58,24,946 కేసులు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 4.5 శాతం ఎక్కువగా ఉంది. మొత్తం హత్యల్లో ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన కారణాలు మూడో స్థానంలో నిలిచాయి.
Love affairs 3rd biggest reason for murders in India, says NCRB report
Crimes against women have seen a 12.3% surge, with 48,755 cases registered. The most common offences in this category include 'cruelty by husband' and 'kidnapping'.
(@nalinisharma_)https://t.co/ciUF5BvXJz
— Law Today (@LawTodayLive) December 4, 2023
ఎన్‌సీఆర్‌బీ డేటాలో ఇతర కీలక అంశాలు..
- దాడులకు సంబంధించిన కేసులు 2002లో 5.3 శాతం మేర పెరిగాయి.
- సీనియర్ సిటిజన్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి వ్యక్తులపై నేరాలు గణనీయంగా పెరిగాయి.
- ఐపీసీ, ప్రత్యేక స్థానిక చట్టాల కింద నమోదవుతున్న కేసుల సంఖ్య కాస్త క్షీణించింది.
- హత్య కేసులు 2.6 శాతం మేర స్వల్పంగా తగ్గాయి.
- ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు వరుసగా 11.1 శాతం, 24.4 శాతం మేర పెరిగాయి.
- మానవ అక్రమ రవాణా కేసులు 2.8 శాతం పెరిగాయి.