Andhra Pradesh: వీడియో ఇదిగో, చంద్రగిరిలో అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్‌పై దాడి చేసిన దుండగులు, పరిస్థితి విషమం
బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. చంద్రగిరి భారతీ నగర్‌కు చెందిన సుధాకర్ కుప్పం డిపో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. చంద్రగిరి భారతీ నగర్‌కు చెందిన సుధాకర్ కుప్పం డిపో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం విధులు ముగించుకుని అర్ధరాత్రి సమయంలో ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు.
ఈ క్రమంలో ఆర్‌ఎఫ్ రోడ్డులో వస్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సుధాకర్‌పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. సుధాకర్ తలకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత కూడా అతనిపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు. అనంతరం పెన్నుతో తల, మెడపై పొడవడంతో సుధాకర్ కేకలు వేశాడు. స్థానికులు అక్కడకు చేరుకోవడంతో దాడికి పాల్పడిన వారు పరారయ్యారు.
తీవ్ర రక్తస్రావం కావడంతో సుధాకర్‌ను ముందుగా చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
Ganja Batch attacked RTC conductor Sudhakar
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)