Andhra Pradesh Rains: ఏపీకి వానలే వానలు, ఆగస్టు- సెప్టెంబరు మధ్యలో సాధారణానికి మించి అధికంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్(జూన్- సెప్టెంబరు)లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆగస్టు- సెప్టెంబరు మధ్యలో లా నినా ప్రభావంతో ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
భారత వాతావరణ విభాగం (IMD) రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో సాధారణానికి మించి అధికంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్(జూన్- సెప్టెంబరు)లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆగస్టు- సెప్టెంబరు మధ్యలో లా నినా ప్రభావంతో ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రైతులకు చల్లని కబురు.. ఈసారి సమృద్ధిగా వానలు.. సాధారణం కంటే అధిక వర్షపాతం.. ఐఎండీ అంచనా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మస్తు వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగమనం ఎప్పుడనే విషయమై మే నెల మధ్య నాటికి స్పష్టత రానుంది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. గత ఏడాది ఎనిమిది రోజులు ఆలస్యంగా జూన్ ఎనిమిదిన కేరళను తాకాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలకు నెమ్మదిగా విస్తరించాయి. దీంతో వర్షాలు సకాలంలో కురవకపోవడమే కాదు.. సమృద్ధిగాను కురవలేదు.
Here's News