EOS-08 Earth Observation Satellite: విజయవంతంగా కక్ష్యలోకి ఈవోఎస్‌-08 ఉపగ్రహం, ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి..

ఇస్రో (ISRO) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట (Sriharikota) షార్(Shar) నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను‌ (SSLV-D3 Rocket ) నింగిలోకి పంపింది. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.

ISRO Successfully Launches Third and Final Developmental Flight of SSLV-D3-EOS8 Mission From Andhra Pradesh

ఇస్రో (ISRO) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట (Sriharikota) షార్(Shar) నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను‌ (SSLV-D3 Rocket ) నింగిలోకి పంపింది. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.చిన్న చిన్న శాటిలైట్లను అభివృద్ధి చేయటం, అందుకు అనుకూలమైన పేలోడ్‌ పరికరాలను రూపొందించే లక్ష్యంలో భాగంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.  ఇస్రో ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం.. విపత్తు నిర్వహణలో సాయపడటమే లక్ష్యం (వీడియోతో)

‘ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌’ ఈవోఎస్‌-08ను (EOS-08 mission) తక్కువ ఎత్తులోని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఈ మిషన్‌ లక్ష్యం. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది.

Here's Video

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement