Vijayawada Floods: ఎమోషనల్ వీడియో ఇదిగో, వరదల్లో చిక్కుకుని రెండు రోజుల తర్వాత కలుసుకున్న వెంటనే ఏడ్చేసిన తండ్రీకొడుకులు

విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయిలో వరద నీరు కొట్టుకొస్తున్నది.భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం చెరువును తలపిస్తోంది. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరదల్లో చాలామంది చిక్కుకుని పోయారు.

Father and Son meet after Two days Being Caught Floods See Emotional Video

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయిలో వరద నీరు కొట్టుకొస్తున్నది.భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం చెరువును తలపిస్తోంది. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరదల్లో చాలామంది చిక్కుకుని పోయారు. తాజాగా ఓ ఎమోషనల్ వీడియో బయటకు వచ్చింది. వరదల్లో చిక్కుకుని రెండు రోజుల తర్వాత తిరిగి కలుసుకున్న అనంతరం తండ్రీకొడుకులు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయవాడ సింగ్ నగర్‌లో వరదల్లో తప్పిపోయి తిరిగి రెండు రోజుల తర్వాత ఈ తండ్రీకొడుకులు కలుసుకున్నారు. ఇంకా ముప్పు పోలే.. ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న మరో తుఫాను గండం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)