MLA Hafeez Khan on CAA: కేంద్రం తీసుకువచ్చిన సీఏఏను అంగీకరించలేం, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కీలక ప్రకటన, వీడియో ఇదిగో
సీఏఏ చట్టం ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా ఉందని దాన్ని అంగీకరించబోమన్నారు.ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏ చట్టం వలన ముస్లిం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. సీఎం జగన్ కూడా మాకు అనునిత్యం అండగా నిలుస్తున్నారు.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కీలక ప్రకటన చేశారు. సీఏఏ చట్టం ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా ఉందని దాన్ని అంగీకరించబోమన్నారు.ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏ చట్టం వలన ముస్లిం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. సీఎం జగన్ కూడా మాకు అనునిత్యం అండగా నిలుస్తున్నారు.
కులాలు, మతాల మీద వివక్ష చూపటం కరెక్టు కాదు. వైఎస్సార్‌సీపీకి అన్ని వర్గాలూ ముఖ్యమే. అందరికీ భద్రత, న్యాయం కల్పించటమే సీఎం జగన్ లక్ష్యం. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారు. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే ఓట్లు వస్తాయని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ సీఏఏ తెచ్చిన బీజేపీతో కలవటం కరెక్టు కాదు. ప్రజలు దీనికి సరైన సమాధానం చెప్తారు’ అని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. సీఏఏని వ్యతిరేకించిన తమిళ హీరో దళపతి విజయ్, స్టాలిన్ సర్కారు అమలుచేయబోమని ప్రజలకు హామీ ఇవ్వాలంటూ ప్రకటన
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)