వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) చీఫ్ దళపతి విజయ్ స్పందించారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని ఈ చట్టాన్ని అమలు చేయవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రజలకు నేతలు హామీ ఇవ్వాలని Thalapathy Vijay డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి చట్టాన్ని అమలుచేస్తే అది దేశ ప్రజల మధ్య సామాజిక సామరస్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సీఏఏను అమలు చేయబోమని ఇప్పటికే కేరళ ప్రకటించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దీనిపై స్పందిస్తామని ఆమ్ ఆద్మీ తెలిపింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు.వివాదాస్పద ఎన్నికల బాండ్ల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ వివాదాస్పద చట్టాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ మండిపడ్డారు. ఐదేళ్లపాటు పెండింగులో పెట్టి ఎన్నికల వేళ అమలు చేయడం ఏంటని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)