K Ravi Chandra Reddy Joins BJP: వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరిన రవిచంద్రారెడ్డి, కారణం ఏంటంటే..
వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి పార్టీకి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపారు. ఇందుకు సంబంధించి రవిచంద్రారెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి పార్టీకి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపారు. ఇందుకు సంబంధించి రవిచంద్రారెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.గతంలో ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేశానని.. ఆరేళ్లుగా వైసీపీ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నానని రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. అయితే తాను వైసీపీకి, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించినదుకు వైఎస్ జగన్‌కు థాంక్స్ చెప్పారు. తన రాజీనామాను ఆమోదించాలని రవిచంద్రారెడ్డి కోరారు.
వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన కాసేపటికే.. రవిచంద్రారెడ్డి బీజేపీ గూటికి చేరారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా వైసీపీ అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే.. పార్టీలోని ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలపై రవిచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి రవిచంద్రారెడ్డికి, వైసీపీ అధిష్టానానికి మధ్య దూరం పెరిగిదంనే వార్తలు వచ్చాయి.ఈ వార్తలకు బలం చేకూరేలా ఆయన వైసీపీనీ వీడి బీజేపీలో చేరారు.
YSRCP Spokesperson k Ravi chandra reddy Quits Party
k Ravichandra reddy joins BJP
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)